డైలీ కరెంట్ అఫైర్స్ 19 నవంబర్ 2020 APPSC జాబ్స్ క్యాలెండర్,పోలీస్ జాబ్స్,రైల్వే జాబ్స్


దక్కన్ డయలాగ్-2020

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) ఆధ్వర్యంలో నవంబర్ 16న దక్కన్ డయలాగ్-2020 వర్చువల్ సమావేశం జరిగింది.

బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీకరణ:

బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్ యునెటైడ్(జేడీయూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఏడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

స్టాట్యూ ఆఫ్ పీస్

స్టాట్యూ ఆఫ్ పీస్’(శాంతి విగ్రహం)పేరుతో నిర్మించిన పఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ విగ్రహాన్ని సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగాప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, నవంబర్ 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.

పంచతత్వ పార్కు:

ఈ పంచతత్వ పార్కును తెలంగాణ రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు నవంబర్ 15న ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఇందిరాపార్కులో పంచతత్వ పార్కును నిర్మించారు.

15వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక:

ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్ శీర్షికన రూపొందించిన నివేదిక ప్రధాని మోదీకి అందజేత.ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్’ శీర్షికన రూపొందించిన ఈ నివేదికను నవంబర్ 17న కమిషన్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా సమర్పించనుంది.రానున్న ఐదు సంవత్సరాల్లో (2021-22 నుంచి 2025-26) కేంద్రం-రాష్ట్రాల మధ్య పన్ను విభజన సహా పలు ఫైనాన్షియల్ సంబంధాలపై సిఫార్సులు చేసేందుకు

టీఎస్-బీపాస్

భవన నిర్మాణ అనుమతుల జారీకి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం(టీఎస్-బీపాస్) ప్రారంభమైంది.హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో నవంబర్ 16న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు టీఎస్-బీపాస్‌ను ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) కొత్త చైర్మన్:

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా అమరవాది లక్ష్మీనారాయణ నియమితులయ్యారు.

అతిపెద్దదైన వాణిజ్య ఒప్పందం

ప్రపంచంలోనే అతిపెద్దదైన వాణిజ్య ఒప్పందం ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్‌నర్‌షిప్- ఆర్‌సీఈపీ)’పై చైనా సహా 15 ఆసియా పసిఫిక్ దేశాలు నవంబర్ 15న సంతకాలు చేశాయి.

అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఆఫీస్-కమ్-రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌:

ఒడిశాలోని కటక్‌లో నిర్మించిన ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఆఫీస్-కమ్-రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను నవంబర్ 11న ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

కేంద్ర జల్ శక్తి శాఖ 2019 అవార్డులు

కేంద్ర జల్ శక్తి శాఖ 2019 సంవత్సరానికి గాను 2వ జాతీయ జల అవార్డులను (ఎన్‌డబ్ల్యుఏ) ప్రకటించింది.2019 ఏడాది ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.ఉత్తమ జిల్లాల కేటగిరీలో ‘నదుల పునరుజ్జీవనం-జల సంరక్షణ’లో అత్యుత్తమ పనితీరు కనబరచి సౌత్ జోన్ (దక్షిణాది రాష్ట్రాల) నుంచి వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

Bhaduri Memorial Lecture Award-2020

Dr Susanta Kar ఈ అవార్డ్ ను పొందారు.

బ్యాంక్ కరెంట్ అఫైర్స్:

రిజర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా ఒక కోటి పెనాల్టీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన వేయడం జరిగింది.

కారణం: violating the Payment and Settlement Systems Act, 2007

SBM బ్యాంక్ కొత్త బ్యాంకింగ్ ప్లాట్ పారం ప్రారంభo:

SBM Bank India set to launch a neo banking platform

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

You may also like...